
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 14 సంవత్సరాల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడుతుండగా పెంపుడు కుక్క నిందితుడిని కరిచి బాధితురాలిని కాపాడింది. పాత నేరస్తులైన ఇద్దరు నిందితులు బాలిక పెంపుడు కుక్క రెచ్చిపోవడంతో ఘటనా స్థలం నుంచి పరుగులు పెట్టారు. సాగర్ జిల్లాలో ఈనెల 18 తెల్లవారజామున ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన రోజు రాత్రి మైనర్ బాలికను తన ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి రేషు అహిర్వార్, పునీత్ అనే పాత నేరస్తులు బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బాధితురాలి కుటుంబ పెంపుడు కుక్క ఓ నిందితుడిని కరవడంతో వారు అక్కడి నుంచి జారుకున్నారని పోలీసులు చెప్పారు.
పెనుగులాటలో బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరుకుందని, ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడైందని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment