
సాక్షి, కడప: ఆవ్యక్తి ఏం తప్పు చేశాడో తెలియదు కానీ ఆ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. లాఠీతో గొడ్డును బాదినట్లు బాదాడు. రోడ్డు మీద వెంటపడీ మరీ ఖాకీ జులుం చూపించాడు. ఏంచేసినా అడిగేవారు లేరు అనుకుంటున్నారో ఏమో కానీ, ప్రశ్నిస్తే మాత్రం వీపు విమాన మోత మోగాల్సిందే. వైఎస్సార్ జిల్లా, కలసపాడు మండలం కేంద్రంలో ఓ పోలీసు కానిస్టేబుల్ చేతిలో లాఠీ ఉంది కదా అని రోడ్డు మీద వ్యక్తిని ఎలా బాదుతున్నాడో చూడండి. అయితే స్థానికులు గుమికూడటంతో సదరు కానిస్టేబుల్ వెనక్కితగ్గాడు. బాధితుడి శరీరంపై మాత్రం లాఠీవాతలు కమిలిపోయి కనిపించాయి.
సామాన్యుడిపై లాఠీచార్జ్ చేస్తున్న కానిస్టేబుల్ వీడియోని వీక్షించండి
Comments
Please login to add a commentAdd a comment