అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ | Rejection of bail petition to TDP Leader Atchannaidu | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Published Sat, Jul 4 2020 5:41 AM | Last Updated on Sat, Jul 4 2020 8:00 AM

Rejection of bail petition to TDP Leader Atchannaidu - Sakshi

సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్‌: కార్మిక రాజ్యబీమా ( ఈఎస్‌ఐ) కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు 

► ఈఎస్‌ఐ కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, మొదటి నిందితుడు సి.కె.రమేష్‌కుమార్, జి.విజయ్‌కుమార్, వి.జనార్దన్, ఇవన రమేష్‌బాబు, గోన వెంకట సుబ్బారావుతో పాటు గత నెల 16న అరెస్టయిన ఇద్దరు నిందితులు కూడా తమ న్యాయవాదుల ద్వారా వేర్వేరుగా బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు.  
► ఇరు పక్షాల వాదనలు బుధవారం ముగిశాయి. ఏపీపీ తన వాదన వినిపిస్తూ నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సా క్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పూ ర్తి కాలేదని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు. కేసు లో ఆరో నిందితుడు బెయిలు పిటిషన్‌ దాఖలు చేసేకోలేదు. 

అచ్చెన్నాయుడు పిటిషన్‌పై ముగిసిన వాదనలు  
రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్న తనకు ఏదైనా కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించేలా ఆదేశాలివ్వాలంటూ అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత శనివారం ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement