
ప్రతీకాత్మక చిత్రం
గద్వాల క్రైం : వాహనదారులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపితే జరిమానా తప్పదని గద్వాల ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రమోహన్‌రావు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారులపై రాంగ్ పార్కింగ్‌లో నిలిపిన వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధించారు.
ఇక నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. మైనర్ బాలలకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు.