సాక్షి, భీమవరం : కామాంధుడి మాయమాటలకు ఓ యువతి మోసపోయింది. నమ్మి వెంటవెళ్లినందుకు లైంగిక దాడికి గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. నర్సాపురంలోని ఐడియా షోరూంలో పనిచేసే యువతి (19)కి స్థానికంగా నివాసముండే డేగల రాంబాబు పరిచయమయ్యాడు. ఓ ముఖ్యమైన పనుందని చెప్పి గత ఆగస్టులో భీమవరంలోని మౌనిక నివాసానికి తీసుకెళ్లాడు. యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా వీడియో తీసి యువతిని గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment