సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం ఉదయం సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు.. ఆటోను ఢీకొట్టి సమీపంలోని షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే బస్సు మీద అదుపు కోల్పోయి.. బీభత్సం సృష్టించాడని స్థానికులు చెప్తున్నారు. ఉదయం సమయం కావడం.. పెద్దగా జనం లేకపోవడంతో ఇక్కడ పెద్ద ప్రమాదం తప్పిందని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment