
ఎందుకలా? మరి.. గూగుల్‌ను అలా కూడా వాడుకోవచ్చని చెప్పింది అతడే కదా.. ఎలాగంటారా? కార్తీక్‌రాజ్.. చెన్నైవాసి.. సిటీలో దొంగతనాలు చేయాలని స్కెచ్ వేశాడు.. నగరానికి వచ్చే ముందే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బాగా డబ్బున్నవాళ్లు ఎవరని ఆరా తీశాడు. ఎలాగో తెలుసా? గూగుల్ ద్వారా.. ఇక్కడ బాగా ధనవంతులు ఎవరని సెర్చ్ చేసి.. 40 మంది కోటీశ్వరుల జాబితాను తయారుచేసుకున్నాడు. పక్కనే వాళ్ల ఆస్తి ఇన్ని కోట్ల రూపాయలు అని రాసుకున్నాడు.
ఇందులో 10 మంది అగ్ర హీరోలు, 10 మంది పారిశ్రామికవేత్తలు, 15 మంది రాజకీయ నేతలు ఉన్నారు. అంతేకాదు.. ఓ రాష్ట్ర సీఎం పేరునూ ఆ జాబితాలో రాసుకుని.. పక్కనే ఆయన ఆస్తిని పేర్కొనడం విశేషం. వాళ్ల ఇళ్లకు కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్లాలని అనుకున్నాడు. ప్లానింగ్ పక్కాగా చేసుకున్నా.. యాక్షన్ విషయానికొచ్చేసరికి బొక్కబోర్లాపడ్డాడు. ఈ నెల 9న బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ.. పట్టుబడ్డాడు. తొలి దొంగతనం ఫెయిలై.. కటకటాలు లెక్కపెడుతున్నాడు. ఇతడిని పోలీసులు విచారించగా.. ఈ విషయాలన్నీ బయటికొచ్చాయి.
– హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment