
సాక్షి, ఖమ్మం: జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా లొంగదీసుకోవడానికి డీఎంహెచ్‌వో కొండలరావు ప్రయత్నించారని, ఇందులో భాగంగా తనను లైంగికంగా వేధిస్తూ.. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపారు. కీచకంగా ప్రవర్తిస్తున్న అధికారి బారి నుంచి కాపాడి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా దళిత, బహుజన సంఘాలతో కలిసి ఖమ్మంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
డీఎంహెచ్‌వో వేధింపులు తట్టుకోలేని బాధితురాలు బుధవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అన్నిమళ్ల కొండలరావు తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అందంగా ఉన్నావు.. కోరిక తీర్చు.. లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తా.. వ్యభిచారం కేసు పెట్టిస్తా అని కొండలరావు వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment