
స్వాతి
సుజాతనగర్ : సీతంపేట బంజరకు చెందిన ధారావత్ స్వాతి (15) విద్యార్థిని మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వీరు, నీలావతి దంపతుల కుమార్తె స్వాతి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. కొన్ని సంవత్సరాలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, వైద్యం కోసం కుటుంబ సభ్యులు కొత్తగూడెం తీసుకెళ్లారు.
మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఖమ్మంలో వైద్యం పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా స్వాతి ఇంట్లో గతంలో రెండేళ్ల బాలుడు కూడా తలసేమియా వ్యాధితోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థి మృతిపై వైద్యాధికారి భూక్యా నాగమణిని వివరణ కోరగా స్వాతి వైద్య రిపోర్టులు పరీక్షించిన ఆమె ‘సికిల్ సెల్ ఎనీమియా’ అనే వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. స్వాతి మృతికి సంతాప సూచకంగా పాఠశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment