
మావోయిస్టుల మృతదేహాల వద్ద పోలీసులు(పాత చిత్రం)
కరీంనగర్ జిల్లా : మహరాష్ట్రలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్ పచ్చిభూటకమని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఎటపల్లి తాలూకాలోని సింలి గ్రామంలో కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి 33 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment