
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేసే ఉద్యోగులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న విజయ్ ఆదివారం తన సొంతింట్లోనే తనువు చాలించాడు. తిరుపతి కొర్లగుంటలోని మారుతీ నగర్‌కు చెందిన విజయ్ ఆత్మహత్యకు పాల్పడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం నెల రోజుల్లోనే ముగ్గురు టీటీడీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment