మృతి చెందిన గంగోత్రి
చిత్తూరు, పూతలపట్టు/దొడ్డబళ్లాపురం/మదనపల్లె సిటీ: వారిద్దరూ కవల సోదరులు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చదువులోనూ పోటీ పడేవారు. అయితే విధి చిన్నచూపు చూసింది. కాలేజీకి బైక్‌పై వెళ్తూ వ్యాన్‌ను వెనుకనుంచి ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూతలపట్టుకు చెందిన మదనమోహన్, సౌభాగ్య దంపతులు కొన్నేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. వారికి కవ ల పిల్లలున్నారు. పెద్దవాడు సాయి హర్షిత్, చిన్నవాడు సాయి హా ర్తిక్. కర్ణాటకలోని గీతం యూనివర్సిటీలో వీరి ద్దరూ బీఈ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నా రు. ఇద్దరిదీ ఒకే సెక్షన్. మంగళవారం ఇద్దరూ బైక్‌పై కళాశాలకు బయల్దేరారు. హర్షిత్ (20) డ్రైవింగ్ చేస్తుండగా హార్తిక్ వెనుక కూర్చున్నాడు. మోపరహళ్లి వద్ద ముందు వెళ్తున్న వ్యాన్‌ను బైక్ ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో హర్షిత్ మృతి చెందగా, హార్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం హర్షిత్ మృతదేహాన్ని, చికిత్స నిమిత్తం హార్తిక్‌ను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాగ్రత్త..బైక్‌లో వెళ్లకండి రా..!– ముందుగానే హెచ్చరించిన పిన్ని
పూతలపట్టులో హర్షిత్, హార్తిక్ చిన్నాన్న, పిన్ని, బంధువులు ఉంటున్నారు. రెండ్రోజుల క్రితం హర్షిత్ ఫోన్‌లో తన చిన్నాన్న, పిన్నితో మాట్లాడాడు. ఇటీవల పూతలపట్టు మండలంలో చోటుచేసుకున్న మోటార్ సైకిళ్ల ప్రమాదాల్లో యువకులు మృతి చెందడంపై కలత చెందిన హర్షిత్ పిన్ని ఫోన్‌లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించి బాధపడ్డారు. బైక్‌లో కాలేజీకి వెళ్లవద్దని, టయాలు బాగా లేవని, బస్సులోనే కాలేజీకి వెళ్లమని హర్షిత్, హార్తిక్‌పై ఉన్న ప్రేమకొద్దీ సున్నితంగా హెచ్చరించారు. జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్తగానే వెళ్తాం– పిన్నీ అంటూ హర్షిత్ బదులిచ్చాడు. అయినా, విధిచూపు చిన్నచూసింది. హర్షిత్ మరణంతో పూతలపట్టులో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పిన్ని, స్థానిక బంధువర్గం కన్నీటిపర్యంతమవుతోంది. బుధవారం ఉదయం ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment