
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్లిన ఇద్దరు బాలికలు గురువారం శవాలుగా మారారు. చిత్రకూట్‌లోని మావో తహసీల్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మృతులు ఇద్దరు గురువారం ఉదయం పొలానికి వెళ్లారు. అయితే ఎంతసేపటికి వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని వెదుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సదరు బాలికలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఆత్మహత్యలేనా?
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా 2014లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి గురయ్యామనే అవమాన భారంతో వారు బలవన్మరణానికి ఒడిగట్టారని బంధువులు ఆరోపించగా.. సీబీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment