![Two Young Sters Missing Due To Fall Into Kakatiya Canal In jagtial - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/16/two-died.jpg.webp?itok=Qa_pN2Sh)
సాక్షి, జగిత్యాల : పండగ వేళ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లిలో సెల్ఫీ దిగడానికి కాలువలోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు రాంబాబు(20), రాజేష్(18) ఫోటో దిగడానికి కాకతీయ కెనాల్లోకి దిగారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment