
సాక్షి, విశాఖపట్నం : సంచలనం సృష్టించిన విశాఖ రేవ్ పార్టీ కేసులో కదలిక మొదలైంది. పార్టీలో మద్యానికి అనుమతి ఇస్తూ లేఖ ఇచ్చిన ఎక్సైజ్ సూపరిండెంట్ సుబ్బారావుపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈవెంట్ల పేరిట అనుమతులు తీసుకుని, ప్రభుత్వ పెద్దల అండదండలతో కొందరు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్‌లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ కుమారుడు నరేంద్రకుమార్ అడగ్గానే అనుమతులిచ్చేశారు.
వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్ శాఖ అనుమతించకూడదు. లిక్కర్ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment