భర్తను చంపి.. లొంగిపోయిన భార్య.. | Wife Surrenders After Killing Husband Brutally | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. లొంగిపోయిన భార్య..

Published Sat, May 26 2018 4:57 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Wife Surrenders After Killing Husband Brutally - Sakshi

గణేశన్‌ మృతదేహం, పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య మాధవి

సాక్శి, చిత్తూరు : జిల్లాలోని శాంతిపురం మండల కేంద్రంలో వ్యాపారి హత్య సంఘటన సంచలనం సృశ్టిస్తోంది. తన భర్తను తానే చంపానంటూ భార్య పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. శాంతిపురంలో శివాజీ గణేశన్ అనే వ్యాపారి గత ఆరు సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

మాధవి అనే మహిళతో ఆయనకు వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శనివారం గణేశన్‌ను తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. వ్యాపార పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండే గణేశన్‌ హఠాత్తుగా హత్యకు గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గణేశన్‌-మాధవి దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే, మాధవి ఉదయం కుప్పం పొలీస్ స్టేశన్‌కి వెళ్ళి లొంగిపోవడం వెనక వారి మధ్య ఏదో గొడవ ఉందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శివాజీ గణేశన్ శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు భార్యే ఈ హత్య చేసి ఉంటుందా? అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.

ఇప్పటికే చిత్తూరు నుంచి క్లూస్ టీం సంఘటనాస్థలంలో అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు కూడా తమ శైలిలో విచారణను ఆరంభించారు. అయితే మృతుడు శివాజీ గణేశన్‌కి అతని కుటుంబం మధ్య తగాదాలు ఉన్నాయని ఈ తగాదాల కారణంగానే వేరేవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో శివాజీ గణేశన్ సోదరుడైన పండరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూలంకషంగా విచారణ జరిగితే తప్ప పండరికి, గణేశన్ హత్యకు ఉన్న లింకు ఏమిటనేది బయటపడదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement