మృతి చెందిన కర్ల రాకేశ్, రాకేశ్ (ఫైల్)
దిలావర్‌పూర్(నిర్మల్) : తమ కుటుంబాన్ని చల్లంగా చూడు తల్లీ అంటూ శ్రీరేణుక ఎల్ల్లమ్మకు మొక్కు తీర్చుకుందామని వచ్చిన ఆ కుటుంబానికి తీరని శోకమే మిగిలింది. ఇంటికి పెద్ద కుమారుడు మంచి ప్రయోజకుడవుతాడని ఎన్నో కలలు కన్న కన్నవారికి తీవ్ర వేదనే మిగి లిపోయింది. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన కర్ల రాకేశ్(16) అనే ఇంటర్ విద్యార్థి దిలావర్‌పూర్ గ్రామ ఎల్లమ్మ ఆలయం వద్ద కోనేటిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందడం విషాదం నింపింది. మంగళవారం ఓలా గ్రామానికి చెందిన కర్ల ము త్యం, రాజమణి దంపతులు తమ ఇద్దరు కుమారులు కూతురుతో దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మ ఆలయానికి మొక్కు తీర్చునేందుకు వచ్చారు. పెద్ద కుమారుడైన కర్ల రాకేశ్ ఆలయ సమీపంలోని కోనేటిలో స్నానమాచరించేందుకు వెళ్లా డు. కోనేరు లోతుగా ఉండడంతో నీటమునిగిపోయాడు.
అక్కడే ఉన్న మరి కొంతమంది భక్తులు నీటమునిగిన రాకేశ్‌ను కోనేటి నుంచి బయటకు తీశారు. వెంటనే 108కు సమాచారం అందించారు. 108 వాహనం నిర్మల్ నుంచి ఘటనాస్థలికి బయలుదేరింది. కాల్‌సెంటర్ ద్వారా అప్రమత్తమైన ఎస్సై ఏ.హరిబా బు సిబ్బంతో కోనేటి ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే రాకేశ్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ వాహనంలో అతడిని తీసుకొని బయల్దేరారు. సిర్గాపూర్ గ్రామం వద్ద 108 వాహనం ఎదురుకాగా.. అందులో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పటికే ఊపిరి తిత్తుల్లోకి నీరు వెళ్లడంతో కార్తీక్ మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్నకొడుకు కళ్లెదుటే మృతి చెందడంతో ఆ కుటుంబం చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించా యి. ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు సైతం చలించిపోయారు. రాకేశ్ కుంటాలోని మోడల్ స్కూల్‌లో చదువుతూ ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రాకేశ్ మృతితో స్వగ్రామమైన ఓలాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment