
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గ మహేష్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఈనెల 18న ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగిన విషయం తెల్సిందే. బాధితురాలి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లోని భాగ్యపల్లికి చెందిన కె.సునిత పనినిమిత్తం ముంబైకి వెళ్లి ఓ ఇంట్లో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తోంది.
అదే ఇంట్లో మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో మూడేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేశ్ ఆమె నుంచి రూ. 1.80 లక్షలు తీసుకున్నా డు. శారీరకంగా దగ్గరకావడంతో యువతి గర్భం దాల్చింది. తీరా పెళ్లి విషయం తెచ్చేసరికి మహేశ్ ముంబై నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడికొచ్చాక పెళ్లి చేసుకోనంటూ సునితతో చెప్పి సెల్ స్విచ్ఛాఫ్ చేశాడు.
దీంతో బాధితురాలు మహేశ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ముంబై వెళ్లి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముంబయి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆందోళన చెందిన మహేశ్ కుటుంబ సభ్యులు ఇద్దరికి వివాహం చేయడానికి రాజీ కుదించారు. మండలంలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం లక్ష్మణ స్వామి ఆలయంలో వివాహం చేయడంతో బాధితురాలికి న్యాయం చేసినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment