మహిళ దారుణ హత్య | Women Murdered in Devarakadra | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Published Tue, May 28 2019 1:34 PM | Last Updated on Tue, May 28 2019 1:34 PM

Women Murdered in Devarakadra - Sakshi

మహిళ శవాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు

దేవరకద్ర: ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని గోప్లాపూర్‌ శివారులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గోప్లాపూర్‌ శివారులోని సామ్రాట్‌ శ్రీనివాసులు వ్యవసాయ పొలంలో ఓ గుర్తుతెలియని మహిళ శవం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు సోమవారం పోలీసులకు అక్కడి రైతులు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మహిళ శవాన్ని పరిశీలించారు. అనంతరం సమాచారం అందిన సీఐ పాండురంగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాదాపు వారం క్రితమే మహిళ మృతిచెంది ఉండవచ్చని సీఐ తెలిపారు.

కిరోసిన్‌ పోసి తగులబెట్టి హత్య ?
ఇదిలాఉండగా, శవాన్ని కిరోసిన్‌ పోసి తగుల బెట్టి హత్య చేసినట్లు కనిపిస్తున్నదని తెలిపారు. శవం బాగా నల్లగా మారి కుళ్లిన స్థితికి చేరుకోవడం వల్ల గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని తెలిపారు. అయితే కొన్ని ఆనవాళ్లు దొరికాయని దీంతో గుర్తించడానికి అవకాశం ఉందని తెలిపారు. మృతురాలికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, ఎడమ చేతిపై చంద్రుని ఆకారంతో పాటు పువ్వు గుర్తు ఉన్న పచ్చబొట్లు ఉందని, కాళ్లకు మెట్టెలు ఉన్నాయని తెలిపారు. చుట్టు పక్కల పీఎస్‌లలో మిస్సింగ్‌ కేసులను పరిశీలిస్తున్నామని, ఎవరైనది త్వరలో తెలిసే అవకాశం ఉందని సీఎ తెలిపారు. అలాగే ఎలా మృతి చెందింది అనే విషయం కూడా బయట పడుతుందని తెలిపారు.  దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను సేకరించారు. అనంతరం శవాన్ని జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement