![Young woman committed suicide In Bus - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/11/young-women-suicide.jpg.webp?itok=7T5Sx2K6)
ఆస్పత్రిలో మృతిచెందిన యువతి
పెనుబల్లి : ఆర్టీసీ బస్సులో భద్రాచలం నుంచి విజయవాడకు బయల్దేరిన ముకిలి లావణ్య (29)అనే యువతి..నురగలు కక్కుతూ చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బస్సు వెళుతుండగా ఆమె నోటి నుంచి నురగలు వస్తున్న విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించడంతో డ్రైవర్ బస్సును పెనుబల్లిలో ఆపాడు.
పురుగుల మందు తాగిందని గ్రహించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా..అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆమె చనిపోయింది. ఆమె చేతిపై ‘ ఐ మిస్ యూ డాడీ. నేనేమీ తప్పు చేయలేదు’ అని రాసి ఉంది.
హ్యాండ్ బ్యాగ్‌లోని పుస్తకంలో ఫోన్ లభించగా..పోలీసులు ఆమె తండ్రికి ఫోన్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కర్లపాలెం ఏఎస్సై కూతురుగా నిర్ధారించినట్లు ఎస్సై డి.నరేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment