
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : నగరంలోని ఉడా కాలనీలో దారుణం జరిగింది. యువతికి మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న యువతిని కొందరు స్నేహితులు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు, సంఘటనా స్థలంలో అచేతనంగా యువతి పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో యువతి అపస్మారక స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోలుకోగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సంఘటన ప్రదేశంలో దొరికిన బైక్ ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment