
సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్త కడవకొల్లు హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మొండికోడు ఠాగూరు దిబ్బ వద్ద గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హరిబాబుపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో పడి ఉన్న హరిబాబును ఆసుప్రతికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య కేసుగా నమోదు చేసి ఏలూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
హరిబాబు వైఎస్సార్‌సీపీ మొండికొడి గ్రామ నాయకుడిగా చురుగ్గా సేవలందిస్తున్నారు. సుమారు ఆరు నెలల క్రితం చేపల చెరువు లీజు డబ్డు విషయమై గ్రామస్తులు చేసిన ఆందోళనకు హరిబాబు నేతృత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలం నుంచి టీడీపీ నాయకులతో వివాదాలు నడుస్తున్నాయి. హరిబాబును టీడీపీ వారే హత్య చేశారనే ఆరోపణలు వినబడుతున్నాయి. హరిబాబు కుటుంబాన్ని శుక్రవారం వైఎస్సార్‌సీపీ నేత కొఠారు రామచంద్రరావు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment