బ్రాడ్ఫోర్డ్: బ్రిటన్లో స్థిరపడిన ప్రముఖ తెలుగు వైద్యులు, ఔత్సాహిక రచయిత డాక్టర్ అచ్యుత రామారావు రచించిన 'చీకటిలో నీడలు' నవలను ఇటీవల ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్లో ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ అచ్యుత రామారావుకు ఇది తొలి నవల అయినప్పటికీ కథనంలో కొన్ని ప్రత్యేకతలు కనబరిచారన్నారు. నాలుగు దశకాల కాలం, ముగ్గురు మిత్రుల విభిన్న జీవన శైలి, నాటి సామాజిక అంశాలను తన దృష్టి కోణంలో చూపేందుకు రచయిత చేసిన ప్రయత్నం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ 'చీకటిలో నీడలు' ప్రతిని స్వీకరించి రచయితను అభినందించారు. ఈ సందర్భంగా రచయిత అచ్యుత రామారావు ప్రసంగిస్తూ.. తన తొలి ప్రయత్నానికి గొల్లపూడి, యార్లగడ్డ లక్ష్మీప్రాసాద్లు అందించిన సహకారం మరువలేనిదన్నారు.
'చీకటిలో నీడలు' పుస్తకావిష్కరణ
Published Thu, May 12 2016 4:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement