అటా ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్..
Published Sun, Aug 20 2017 12:36 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
నాష్‌విల్లే: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో శనివారం నాష్‌విల్లేలోని శ్రీ గణేశా ఆలయ ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీటీ సేవా, హిందూ కల్చరల్ సెంటర్ టేనస్సీలు సహకారం అందించాయి. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక విభాగాల్లో నిపుణులైన 25 మంది డాక్టర్లు, 10 మంది వైద్య విద్యార్థులు, 20 మంది అటా వాలంటీర్లు, 10 మంది వీటీ సేవా వాలంటీర్లు, టేనస్సీ కిడ్నీ ఫౌండేషన్ నుంచి 10 మంది ఉద్యోగులు పాల్గొని సేవలందించారు. ఈ వైద్య శిబిరానికి 100 మందికి పైగా పాల్గొని ఉచిత వైద్య సేవలు పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వైద్య శిబిరంలో బీపీ, బీఎమ్‌ఐ, డయాబెటీస్, మూత్ర పరీక్షలు, కొవ్వు, గుండె సంబంధించిన వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు జరిపి వైద్య సేవలందించారు. సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహనా కల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరానికి హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డాక్టర్లందరికీ అటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆడిటోరియం ఇచ్చిన శ్రీసాయి గణేశ్ ఆలయ బోర్డు సభ్యులకు కూడా అటా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో అటా చైర్మెన్ ఆల రామకృష్ణా రెడ్డి, అటా నాష్‌విల్లా రిజినల్ కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి, అటా ఫౌండేషన్ కో- చైర్మెన్ సుశీల్ చందా, కిశోర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రాధిక రెడ్డి, లావణ్య నూకల, రవళి, బింధుమాధవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement