రికార్డులు తనిఖీ చేస్తున్న సిఈవో శంకరబాబు
గంగాధరనెల్లూరు: రబీలో రైతులకు రూ.100 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని జిల్లా సహకారబ్యాంకు సీఈవో శంకర్‌బాబు తెలిపారు. స్థానిక సహకార బ్యాంకుబ్రాంచి, సింగిల్‌విండో సొసైటీని బుదవారం ఆయన తనిఖీ చేశారు. సీఈవో మాట్లాడుతూ రైతులకిచ్చిన రుణాలను సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 76 సహకార సంఘాలు ఉండగా అందులో 39 సంఘాలు లాభాల్లో ఉన్నాయని అందులో గంగాధరనెల్లూరు సింగిల్‌విండో సొసైటీ ఒకటన్నారు. రబీ సీజన్‌లో మరో రూ.100 కోట్లు లక్ష్యంగా రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి లిల్లీకాధరిన్, బ్యాంకు మేనేజర్ మెహబూబ్‌బాషా, సిఈవో విజయకుమార్ , కార్యదర్శులు పాల్గొన్నారు.