వ్యవసాయ శాఖలో వెయ్యి ఉద్యోగాలు
2 వేల హెక్టార్ల భూ విస్తీర్ణానికి ఒక విస్తరణాధికారి: పోచారం
హన్మకొండ: రాష్ట్రంలో ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉండాలనే ఉద్దేశంతో వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖాళీగా ఉన్న 120 వ్యవసాయ అధికారి పోస్టులు, ఉద్యాన శాఖలోని 70 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి ప్రారంభించారు. ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని పోచారం తెలిపారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల్లో ఇక నుంచి వ్యవసాయ అధికారి చీటి రాస్తేనే ఆ రైతుకు క్రిమి సంహారక మందులు విక్రరుుంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమీక్ష సమావేశంలో పోచారం చెప్పారు.