
ఘనంగా 101 ప్రసాద వినియోగం
రొళ్ల : మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా శనివారం 101 ప్రసాద వినియోగం నిర్వహించారు. శుక్రవారం జరిగిన భూతప్ప ఉత్సవాల్లో భక్తులు కానుకుల కింద నైవేద్యంగా సమర్పించిన వడిబియ్యం, కందిపప్పు, బెల్లం తదితర వాటితో నియమ నిష్టలతో ప్రసాదం తయారు చేసి భూతప్ప ఆలయ ముందు ప్రసాదాన్ని 101 ముద్దలుగా చేసి ఉంచి పూజలు చేశారు. భూతప్ప ప్రతిమలకు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. దాసప్పలు ప్రసాదం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అదేవిధంగా ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల పెద్దలకు కమిటీ తరఫున ప్రసాదం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.