పుష్కరాలకు 1800 మంది
Published Wed, Aug 3 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నెల్లూరు(క్రైమ్):
కృష్ణా పుష్కరాలకు జిల్లాకు చెందిన 1800 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు బందోబస్తు స్కీమ్‌ను పోలీసు అ«ధికారులు సిద్ధం చేశారు. ఈనెల 8 నుంచి 25 వరకు విజయవాడలో కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 73 మంది ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది 250 మందితో పాటు1443 సివిల్, హోంగార్డులు బందోబస్తులో పాల్గొననున్నారు. వీరందరూ గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, విజయవాడ జీఆర్‌పీఎఫ్‌ల్లో విధులు నిర్వహించనున్నారు. పుష్కరాలకు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా తడ నుంచి కావలి వరకు జాతీయ రహదారిపై 21 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీకి ఇప్పటికే కమాండ్ కంట్రోల్ బాధ్యతలను అప్పగించారు. ఈనెల 7వ తేదీన సిబ్బంది అందరూ విజయవాడకు తరలనున్నారు.
Advertisement