అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి.
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. వై రాంపురంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త ఓబులమ్మకు ఎందిన 20ఎకరాల పొలాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనప్పకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే శ్రీనప్పపై పోలీసులకు ఓబులమ్మ ఫిర్యాదు చేసింది. అయితే.. పయ్యావుల పేరు లేకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆమెకు చెప్పారు. 2009లో ఓబులమ్మ భర్త సూరయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనప్ప నిందితుడిగా విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆమె కుటుంబంపై పయ్యావుల ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఒత్తిళ్లను ఓబులమ్మ ఖాతరు చేయకపోవడంతో ఆమెపై ఈ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.