3.535 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి | 3.535 million units electrictity generated | Sakshi
Sakshi News home page

3.535 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి

Published Sun, Sep 11 2016 12:25 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

3.535 million units electrictity generated

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో శుక్రవారం నుంచి శనివారం వరకు 3.535 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదనకు 6,439 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. శనివారం శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లోని సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా 3,214 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వచ్చి చేరింది. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక జనరేటర్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 4,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 145.1520 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 870.80 అడుగులకు చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement