శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం సోమవారం 863.30 అడుగులకు చేరుకుంది. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రతిరోజూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడంతో నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో 2.392 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. డిమాండ్‌ను బట్టి సోమవారం కూడా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాయంలో 116.3528 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.