శ్రీశైలం నుంచి 6,685 క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం నుంచి 6,685 క్యూసెక్కుల నీటి విడుదల
Published Fri, Jan 13 2017 10:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి ఎగువ ప్రాంతాలకు 6,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణా ప్రాంతంలోని భూగర్భజలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆంధ్రా ప్రాంతంలోని కుడిìగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం నుంచి శుక్రవారం వరకు 1,565 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్‌కు 3,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ నీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 1,200 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాయలసీమ ప్రాంతానికి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని శుక్రవారం కూడా యథావిథిగా కొనసాగిస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 101.1935 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 858.40 అడుగులుగా నమోదైంది.
Advertisement