గుంటూరు రూరల్ : గుంటూరులో దారుణం జరిగింది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నలుగురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.