వేగంగా వెళ్తున్న కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మం: వేగంగా వెళ్తున్న కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా.. మద్దులపల్లి వద్ద కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.