వేగంగా వెళ్తున్న కారు బోల్తాకొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి
వనపర్తి: వేగంగా వెళ్తున్న కారు బోల్తాకొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని కొత్తకోట సమీపంలో శనివారం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.