బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) :
ప్రచండ భానుడి దెబ్బకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో రాజు అనే రైతుకు చెందిన కోళ్ల ఫారంలో సోమవారం 600 కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోయాయి. వీటిని ఓ గోతిలో పూడ్చివేసినట్లు రైతు రాజు తెలిపాడు.