కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు, ఇతరత్రా అవసరాలకు భూసేకరణ, నివాస గృహాల పరిహారానికి రూ. 6,500 కోట్లు అవసరమవుతాయని నీటిపారుదలశాఖ లెక్కలు వేసింది.
► కాళేశ్వరం ప్రాజెక్టు కింద 7,200 ఇళ్ల ముంపు
► 80 వేల ఎకరాల భూసేకరణ అవసరం
► ‘పాలమూరు’ మాదిరే ఇంటి రకాన్ని బట్టి పరిహారం
► రెండు వారాల్లో ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు, ఇతరత్రా అవసరాలకు భూసేకరణ, నివాస గృహాల పరిహారానికి రూ. 6,500 కోట్లు అవసరమవుతాయని నీటిపారుదలశాఖ లెక్కలు వేసింది. ప్రాజెక్టు కింద 80 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా రిజర్వాయర్ల కింద 7,200 ఇళ్లు ముం పునకు గురవుతాయని అంచనా వేసింది. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం త్వరలోనే జరుగుతుండటం, 18 నెలల్లో బ్యారేజీల నిర్మా ణ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్న దృష్ట్యా 2 వారాల్లో పరిహార చెల్లింపు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పాత డిజైన్‌లో 12 టీఎం సీలు కూడా లేని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 160 టీఎంసీలకు పెంచింది. దీంతో ముంపు కూడా అదేస్థాయిలో పెరిగింది. మారిన డిజైన్ కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.75 వేలకోట్ల వరకు ఉండనుండగా అందులో భూపరిహారానికే రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
‘పాలమూరు’ మాదిరే ఇళ్లకు పరిహారం
ముంపునకు గురవుతున్న 7,200 ఇళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కొత్తగా తెచ్చిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇంటి నిర్మాణం ప్రాథమిక అంచ నా రూ. 4 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉం టే నిర్మాణ వైశాల్యం (ప్లింత్ ఏరియా) రేట్ల ఆధారంగా పరిహారం లెక్కిస్తారు. రూ.4 లక్షలకుపైగా ఉన్న గృహ నిర్మాణాలకూ గృహ ర్మాణ రకాన్ని అనుసరించి ముందుగా నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా చదరపు మీటర్ చొప్పున చెల్లిస్తారు. నిర్మాణాల్లో వాడే సాధారణ కలప, టేకు కలపకు చెల్లించే ధరలకు విడిగా ధరలను నిర్ణయించారు. కలప పరిహా రానికి రూ. 1,500 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచ నా. మరో రెండు వారాల్లో ఈ పరిహార చెల్లింపు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.