ఎనిమిదిళ్లు భస్మీపటలం | 8 HOUSES FIRED | Sakshi
Sakshi News home page

ఎనిమిదిళ్లు భస్మీపటలం

Published Wed, May 24 2017 11:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

ఎనిమిదిళ్లు భస్మీపటలం - Sakshi

ఎనిమిదిళ్లు భస్మీపటలం

వేలేరుపాడు: వేలేరుపాడు పంచాయతీలోని జగన్నాథపురంలో బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.45 లక్షల‡ ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. జగన్నాథపురంలో పోస్ట్‌మన్‌ షేక్‌ అక్బర్‌పాషా ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చాంద్‌పాషా, పుతిలి, ని మ్మారి కృష్ణవేణి, మజ్జి రాంబాబు, శ్రీను, సావిత్రి, మణికంఠ ఇళ్లకు వ్యాపిం చాయి. ఆయా ఇళ్లలోని రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు శబ్ధంతో స్థానికులు పరుగులు తీశారు. గ్యాస్‌ పేలుడు ధాటికి కొమ్మన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తలకు గాయమైంది. ప్రైవేట్‌ ట్యాంకర్‌ ద్వారా నీళ్లు తెప్పించి గ్రామస్తులు మంటలను అదుపుచేశారు.  వేలేరుపాడుకు 22 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్‌ఇంజిన్‌ ఆలస్యం గా వచ్చేటప్పటికీ సర్వం కాలిపోయాయి. ఆయా ఇళ్లలోని రేషన్, ఆధార్‌ కార్డులు, బ్యాంక్‌  పుస్తకాలు, సుమారు రూ.3 లక్షల నగదు, 20 కాసుల బంగారం, 15 తులాల వెండి, 6 క్వింటాళ్ల ధాన్యం, 2 క్వింటాళ్ల మినుములు, క్వింటా పెసలు, 8 టీవీలు, 6 ఇసుప బీరువాలు, ఫ్యాన్‌లు, కూలర్‌లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. 
పెళ్లి కోసం దాచిన సొత్తు బుగ్గి
అక్బర్‌పాషా తన చెల్లెలు నజీమా పెళ్లి కోసం ఇంట్లో దాచిన రూ.2 లక్షల నగ దు, ఆరు కాసులు బంగారు నగలు, రెం డు జతల వెండి పట్టీలు, సిద్ధం చేసిన రూ.లక్ష విలువైన ఫర్నీచర్‌ కాలిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. నిమ్మారి కృష్ణవేణికి చెందిన రూ.50 వేల నగదు, రెండు జతల బంగారు బుట్టలు, గొ లుసు, సావిత్రికి చెందిన 40 వేల నగదుతోపాటు రెండు కాసుల బంగారు నగలు బుగ్గికావడంతో ఘొల్లుమన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement