సౌదీలో ఆదిలాబాద్ వాసి మృతి | adilabad district man dies in saudi arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో ఆదిలాబాద్ వాసి మృతి

Published Mon, Nov 30 2015 3:51 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

adilabad district man dies in saudi arabia

ఆదిలాబాద్: పొట్ట కూటి కోసం సౌదీకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుంటాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన చాక్‌పల్లి అశోక్(35) ఈ ఏడాది అక్టోబర్ 20న సౌదీ అరేబియాకు వెళ్లాడు.

సౌదీలో శనివారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అశోక్.. ఆదివారం సముద్రం తీరంలో శవమై కనిపించాడు. ఇది గుర్తించిన సౌదీలోని కొందరు తెలుగువాళ్లు స్థానిక పోలీసులకు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అశోక్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అశోక్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement