అరటిలో పర్టిగేషన్‌ పద్ధతితో అధిక దిగుబడి | agriculture story | Sakshi
Sakshi News home page

అరటిలో పర్టిగేషన్‌ పద్ధతితో అధిక దిగుబడి

Published Tue, Aug 15 2017 10:48 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అరటిలో పర్టిగేషన్‌ పద్ధతితో అధిక దిగుబడి - Sakshi

అరటిలో పర్టిగేషన్‌ పద్ధతితో అధిక దిగుబడి

అరటికి ఫర్టిగేషన్‌ పద్ధతి భేష్‌
– ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్‌

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల్లో ఒకటైన అరటి పంటను రైతులు అధికంగా సాగు చేస్తారు. అధికారుల మెలకువలు, సూచనలు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించొచ్చు. ఫర్టిగేషన్‌ పద్ధతి ద్వారా పోషకాలు అందజేయడం వల్ల అరటి పంటలో అధిక దిగుబడి సాధించొచ్చని ఉద్యానశాఖ టెక్నికల్‌ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లాలో అరటి 12 వేల హెక్టార్లకు పైబడి సాగులో ఉన్నందున రైతులు ఎరువుల ఖర్చు తగ్గించుకొని నికర ఆదాయం పొందడానికి  ఫర్టిగేషన్‌ విధానం అవలంభించాలని ఆయన సూచించారు. ఫర్టిగేషన్‌ పద్ధతి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన అరటి రైతులకు తెలియజేశారు.

ఫర్టిగేషన్‌ పద్ధతి :
    నీటిలో కరిగే ఎరువులు డ్రిప్‌ (బిందు) పరికరాల ద్వారా సరైన మోతాదులో నేరుగా మొక్కలకు అందించడాన్ని ఫర్టిగేషన్‌ విధానం అంటాం. ఇది ఎరువుల వినియోగంలో మంచి సామర్థ్యం గల పద్ధతి.  ఈవిధానం ద్వారా దశల వారీగా మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడానికి వీలవుతుంది. దేశంలో ఏటా రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్నప్పటికీ వాటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. అందులో నత్రజని–భాస్వరం–పొటాష్‌లకు వరుసగా 40, 20, 50 శాతముగా ఉంది. అంటే అందించిన ఎరువులలో సగానికి పైగా వృథా అవుతోందని తెలుస్తోంది. అందుకు కారణంగా ఎరువులను పొలంలో వెదజల్లడం వల్ల మొక్కల మధ్య ఖాళీ స్థలంలో పడి వృథా అవడమే కాకుండా పొలమంతా సమానంగా పడకుండా పంట దిగుబడి తగ్గిపోతుంది.

ప్రయోజనాలు:
    నీరు, పోషకాలు ఎల్లపుడూ అందుబాటులో ఉండటం వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటూ ఉత్పత్తి, నాణ్యత అధికంగా ఉంటుంది.అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. పోషకాల అందుబాటు గ్రహణ శక్తి పెరుగుతుంది. మొక్కల వేర్లకు ఎలాంటి హాని ఉండదు. కూలీలు, సమయం, విద్యుత్‌శక్తి ఆదా అవుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా ఉండదు. నేల గట్టిపడదు. నేలలో తేమ, గాలి అనువైన నిష్పత్తిలో ఉంటుంది. ఎరువులకు అయ్యే ఖర్చు సాధారణ సాంప్రదాయ పద్ధతి కన్నా తక్కువ. నేల కాలుష్యం జరగదు. కూలీల ఆరోగ్యానికి హాని జరగదు.

ఫర్టిగేషన్‌ పద్ధతిలో అరటికి ఎరువులు ఇలా...
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
పంట దశ (రోజులు)            ఎరువులు            మోతాదు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
30 నుంచి 90వ రోజు వరకు    యూరియా            ఒక కిలో
                    వైట్‌ పోటాష్‌            ఒక కిలో
                    19–19–19            500 గ్రాములు
91 నుంచి 120వ రోజు వరకు    యూరియా            ఒక కిలో
                    వైట్‌ పొటాష్‌            ఒక కిలో
                    12–61–0            500 గ్రాములు
95, 100, 105, 110వ రోజు        సీఎన్‌                3 కిలోలు
121 నుంచి 180వ రోజు వరకు    అమ్మోనియంసల్ఫేట్‌        ఒక కిలో
                    యూరియా            ఒక కిలో
                    వైట్‌ పొటాష్‌            1.5 కిలో
                    మెగ్నీషియంనైట్రేట్‌        500 గ్రాములు
181 నుంచి 240వ రోజు వరకు    యూరియా            ఒక కిలో
                    అమ్మోనియంసల్ఫేట్‌        500 గ్రాములు
                    వైట్‌ పొటాష్‌            500 గ్రాములు
                    13–0–45            1.5 కిలో
241 నుంచి 300వ రోజు వరకు    అమ్మోనియంసల్ఫేట్‌        ఒక కిలో
                    వైట్‌పొటాష్‌            500 గ్రాములు
                    13–0–45            1.5 కిలో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement