అనంతపురం అగ్రికల్చర్ : గాలివేగం పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉక్కపోత కొనసాగుతోంది. మంగళవారం శింగనమలలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, పుట్లూరు, గుంతకల్లు 39.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గాలులు గంటకు సగటున 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో వీచాయి. గుంతకల్లు, బీకేఎస్, యాడికి, కనగానపల్లి, రాప్తాడు, బత్తలపల్లి, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, నార్పల, రాయదుర్గం, పుట్లూరు, పెద్దపప్పూరు, బొమ్మనహాల్, డి.హిరేహాల్, అమడగూరు, మడకశిర, రొద్దం, ఓడీ చెరువు, ఎన్‌పీ కుంట, కదిరి, కొత్తచెరువు, తలుపుల, బుక్కపట్నం, చెన్నేకొత్తపల్లి, రామగిరి, నల్లచెరువు మండలాల్లో గాలివేగం 20 కిలో మీటర్లకు పైగా రికార్డయ్యింది. ఆకాశం మేఘావృతమై గుంతకల్లు, ఓడీ చెరువు, శింగనమల, పామిడి, గార్లదిన్నె, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, నార్పల తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి.