తాగుబోతుల వీరంగం.. సీఎస్‌డీటీపై దాడి | alcoholics attacked on csdt | Sakshi
Sakshi News home page

తాగుబోతుల వీరంగం.. సీఎస్‌డీటీపై దాడి

Published Mon, Mar 6 2017 12:35 AM | Last Updated on Fri, Aug 17 2018 7:49 PM

alcoholics attacked on csdt

= పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సీఎస్‌డీటీ

ధర్మవరం : పట్టణంలోని ఇందిరమ్మకాలనీలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. అడ్డొచ్చిన సీఎస్‌డీటీపై దాడికి పాల్పడ్డారు. స్థానిక ఇందిరమ్మకాలనీలో తాగిన మైకంలో పక్కీరప్ప, మధు ఓ వృద్ధుడిని కొడుతుండగా చౌక దుకాణాలను తనిఖీ చేసేందుకు వెళ్తున్న సీఎస్‌డీటీ హరిప్రసాద్‌ అడ్డుకున్నాడు.  సర్దిచెప్పడానికి ప్రయ త్నిస్తే ‘నువ్వు ఎవరు చెప్పడానికి’  అంటూ సీఎస్‌డీటీ హరిప్రసాద్‌పై దాడికి దిగారు. దీంతో స్థానికులు వచ్చి వారిని  విడిపించారు. దీంతో సీఎస్‌డీటీ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. కానీ స్థానిక తెలుగు తమ్ముళ్లు తాగుబోతుల వీరంగాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు చేసినట్లుగా బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement