'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా' | allways welcome to tdp leders for debate on palamuru projects | Sakshi
Sakshi News home page

'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'

Published Wed, Jul 15 2015 8:08 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా' - Sakshi

'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'

హైదరాబాద్: తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరో సవాల్ విసిరారు. తాను రేపు ఉదయం 10 గంటల నుంచి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో అందుబాటులో ఉంటానని అక్కడికి ఎవరైనా రావొచ్చని చెప్పారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ నుంచి ఎవరొచ్చినా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. అంతకుముందు ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానని, టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ చేసిన విషయం తెలిసిందే.

పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా  గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement