లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా..
Published Mon, Sep 26 2016 11:18 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
ఫలితం శూన్యం..
గ్రీవెన్స్ బాలిక గోడు
గుంటూరు ఈస్ట్: తనపై సామూహిక లైంగికదాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ బాలిక రూరల్ డీఎస్పీకి సోమవారం గ్రీవెన్స్‌లో మొరపెట్టుకుంది. ఆమె ఫిర్యాదులో వివరాలు.. బొల్లాపల్లి మండలం ఏనుమడతండాకు చెందిన బాలిక వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. రెండు నెలల క్రితం కాలేజీ బయటకు రాగా అదే తండాకు చెందిన బోక్యాయోహా నాయక్ బాలిక అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఊరి చివరకు తీసుకు వెళ్లాడు. అక్కడ ఉన్న కొండా నాయక్, హనుమా నాయక్ (రౌడీషీటర్), బాణావత్ హనుమా నాయక్, బౌడునాయక్, ముదావత్ నాగార్జుననాయక్‌తో కలిసి బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ విషయమై బొల్లాపల్లి ఎస్సైకు , వినుకొండ సీఐకు ఫిర్యాదు చేసినా∙పట్టించుకోలేదని, న్యాయం చేయాలని బాలిక వేడుకుంది. అలాగే పెళ్లిపేరుతో మోసం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. క్రోసూరు మండలానికి చెందిన ఓ యువతి పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నది.గ్రామానికి చెందిన రావెల రాజేష్ హైదరాబాదులోని మెడిసిటీ కళాశాలలో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి ఇరువురం ప్రేమించుకుంటున్నామని, రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తాడికొండ మండలంలోని రాజేష్ తాతయ్య ఇంటికి తీసుకువెళ్లి కొద్దిరోజుల తర్వాత ఇంటి నుండి గెంటి వేసాడని, న్యాయం చేయాలని ఆమె కోరింది. రూరల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు మొత్తం 15 ఫిర్యాదులు స్వీకరించారు.
Advertisement
Advertisement