‘హోదా’ సాధనకు మోదీ, చంద్రబాబు మెడలు వంచుతాం | Ambati Rambabu fire on Modi, Chandrababu | Sakshi
Sakshi News home page

‘హోదా’ సాధనకు మోదీ, చంద్రబాబు మెడలు వంచుతాం

Published Fri, Jan 27 2017 1:50 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

‘హోదా’ సాధనకు మోదీ, చంద్రబాబు మెడలు వంచుతాం - Sakshi

‘హోదా’ సాధనకు మోదీ, చంద్రబాబు మెడలు వంచుతాం

సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలే కాదు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెడలు సైతం వంచుతామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభు త్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు పిలుపునిచ్చి స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తుంటే చంద్రబాబుకు ఎందుకు భయం?  అని ప్రశ్నించారు.

పోలీసులు దౌర్జన్యం చేశారు
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యం చేశారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం ఎయిర్‌పోర్టు నుంచి ఓ టీవీ చానల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మఫ్టీలో ఉన్న పోలీసులు తమను ఎయిర్‌పోర్టులో నిర్బంధించి, దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. డొమెస్టిక్‌ అరైవల్‌లోకి వెళ్లన్వికుండా తలుపులు మూసేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement