స్మార్ట్సిటీల జాబితాలో అమరావతి | amravati in smart city list, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

స్మార్ట్సిటీల జాబితాలో అమరావతి

Published Thu, Jun 16 2016 11:09 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

స్మార్ట్సిటీల జాబితాలో అమరావతి - Sakshi

స్మార్ట్సిటీల జాబితాలో అమరావతి

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా వెంకయ్యనాయుడు గురువారం విజయవాడ విచ్చేశారు.

అందులోభాగంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... తక్కువ ప్రీమియంకే రైతులకు పంటల బీమా చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... పోలవరం అథారటీ ద్వారానే ప్రాజెక్ట్ పనులు చేపడతామన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయం ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇస్తుందని హరిబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement