విజయవాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై 9 నెలల్లో నివేదిక ఇస్తామని జస్టీస్ మంజునాథ కమిటీ చెప్పినట్లు తెలిపారు. త్వరలోనే కమిషన్ విధి విధానాలను తయారు చేయనున్నట్లు నారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బీసీ కమిషన్ సభ్యులను నియమించనుందని ఆయన వెల్లడించారు.
కాగా, కాపు రిజర్వేషన్ అంశం జఠిలమైందని జస్టీస్ మంజునాథ తెలిపారు. ప్రస్తుతం కాపు జనాభా గణాంకాలు అందుబాటులో లేనందున 13 జిల్లాల్లో పర్యటించి గణాంకాలు సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.