సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునేం దుకు కృష్ణా బోర్డు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునేలా రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడం, నీటి వాటాల భయంతో ఆంధ్ర ప్రదేశ్ పెద్దగా అడ్డుపడక పోవడంతో కృష్ణా బోర్డు వెనక్కి తగ్గింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం పక్కకు జరిగినట్లేనని రాష్ట్ర నీటిపారు దల వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన కృష్ణాబోర్డు సమావేశంలో ప్రాజెక్టుల వర్కింగ్ మాన్యువల్‌పై వాడీవేడి చర్చ జరిగింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లతో పాటు హంద్రినీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియం త్రణలో ఉంటాయని తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొం దించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా నియంత్రణలు ఉంటాయని తెలుప గా, తెలంగాణ వ్యతిరేకించింది.
రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వీటి నిర్వహణనే చూడాలని స్పష్టం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న సాగర్, శ్రీశైలం కింద వాటాలను ఎలా తేలుస్తారని ప్రశ్నించింది. ట్రిబ్యునల్ కేటాయించిన ఎన్ బ్లాక్ కేటాయింపులకు అనుగుణంగానే పంపి ణీ జరగాలని, అంతకుమించి ఇతర ప్రత్యామ్నాయాలేవీ ఒప్పుకోమని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. దీనికి సమాధానంగా ఇప్పటికే ఉన్న కేటాయింపుల మేర పక్కాగా, పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలీమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా, మళ్లీ ప్రాజెక్టుల నియంత్రణ అవసరం ఏంటని తెలంగాణ ప్రశ్నించింది.
ఏపీలో ఉన్న గురురాఘవేంద్ర తదితర లిఫ్టులు, వెలిగొండ టన్నెల్, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలిగోడు, శ్రీశైలం ఆఫ్ టేక్–1, శ్రీశైలం ఆఫ్ టేక్–2, చిన్న ముక్కపల్లి ఆఫ్ టేక్, సోమశిల కండలేరు లింక్, కండ లేరు–పూండి, పూండి ఆఫ్ టేక్ (ఏపీ తమిళ నాడు సరిహద్దు), శ్రీశైలం ఫోర్ షోర్ దగ్గర ఇతర లిఫ్టులు, ఏఎమ్‌ఆర్పీ ఆఫ్ టేక్‌ల కింద సైతం టెలీమెట్రీ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ అంశంతో పాటు, లభ్యత జలాలపై తెలం గాణ పట్టుబడితే తమకు అసలుకే నష్టం వస్తుందన్న ఆందోళన సైతం ఏపీని వెనక్కి తగ్గేలా చేసింది. దీంతో బోర్డుసైతం ఈ అంశం పై మళ్లీ చర్చిద్దామని వాయిదా వేసింది. దీం తో ప్రస్తుతానికి నియంత్రణ అంశం మరుగు న పడినట్లేనని తెలంగాణ స్పష్టం చేస్తోంది.
ప్రాజెక్టుల నియంత్రణ పక్కకు!
Published Fri, Feb 10 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
Advertisement
Advertisement