భక్తి పరవళ్లు | anthya pushkaralu | Sakshi
Sakshi News home page

భక్తి పరవళ్లు

Published Thu, Aug 4 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

భక్తి పరవళ్లు

భక్తి పరవళ్లు

  • ఐదో రోజూ 37,096 మంది పుణ్యస్నానాలు 
  • భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు 
  • పెరుగుతున్న వరద
  • పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఐదో రోజు గురువారం భక్తుల స్నానాలతో నదీతీరం పరవశించింది. జిల్లా వ్యాప్తంగా 37,096 మంది పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేద్రవరం నగరంలోని ఘాట్లలో స్నానమాచరించేందుకు 22,521 మంది భక్తులు రాగా ఇందులో ఒక్క పుష్కరఘాట్‌లోనే 15,395 మంది స్నానమాచరించారు. జిల్లాలోని అంతర్వేది, అప్పన పల్లి, అయినవిల్లి, కోటిపల్లి తదితర ఘాట్లలో స్థానిక ప్రజలు స్నానాలు చేసి సమీపంలోని ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాజమహేంద్రవరంలోని పద్మావతి, శ్రద్ధానంద, టీటీడీ ఘాట్లలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది.  రాజమహేంద్రవరంలోని ఘాట్లకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఘాట్లలో స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థుల సేవలు కొనసాగుతున్నాయి. వరద నేపథ్యంలో ఘాట్ల వద్ద పరిస్థితిని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. 
    వరదతో అప్రమత్తం...
    గోదావరి ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదికి వరద వస్తోంది. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల, పుష్కర  ఘాట్లలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ముందుగా నిర్ణయించిన మేరకు నీటి స్థాయి ఉండేలా ఇరిగేషన్‌ అధికారులు కాటన్‌ బ్యారేజీ నుంచి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. మత్స్య, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నీటి పరిమాణం పెరగడంతో సరస్వతీఘాట్‌లో రక్షణగా కట్టిన తాడును అధికారులు ముందుకు జరిపారు. వరద వల్ల ఘాట్లపై నిలిచిన వ్యర్థాలను అగ్నిమాపక, నగరపాలక సంస్థ సిబ్బంది శుభ్రం చేశారు.  భక్తుల ర ద్దీ సాధారణంగా ఉండడంతో గోదావరి గట్టుపై ట్రాఫిక్‌ ఆంక్షలు తొగించారు. హారతి సమయంలో ఆంక్షలను తిరిగి యథావిధిగా కొనసాగాయి. 
    అలరించిన  సాంస్కృతిక కార్యక్రమాలు
     సాయంత్రం ఆనం కళాకేంద్రంలో గోదావరి సింగర్స్‌ క్లబ్‌ సభ్యులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కోటిలింగాలఘాట్‌ వద్ద తెరపై నగరపాలక సంస్థ డాక్టర్‌ చక్రవర్తి చిత్రాన్ని ప్రదర్శించింది. పుష్కరఘాట్‌ ఎదురుగా ఉన్న మండపం వద్ద నగరపాలక సంస్థ సౌజన్యంతో టీటీడీ పరిధిలోని హిందూ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కాకినాడ మౌనిక బుర్రకథ బృందం నిర్వíß ంచిన ‘సీతా కల్యాణం’ బుర్రకథలో హాస్యం పేరుతో ద్వందార్థాలతో సాగడంతో విమర్శలు వినిపించాయి. 
    –––––––––––––––––––––––––––––––––––
    జిల్లాలో ఘాట్ల వారీగా స్నానమాచరించిన భక్తుల సంఖ్య 
    ఘాట్‌                          భక్తులు 
    1.కోటిలింగాలఘాట్,  4,060
    2.పుష్కరఘాట్‌ 15,395
    3.మార్కండేయఘాట్‌ 168 æ
    4.టీటీడీఘాట్‌ 238
    5.శ్రద్ధానంద ఘాట్‌ 78æ
    6.పద్మావతిఘాట్‌ 315
    7.గౌతమిఘాట్‌ 997
    8.సరస్వతిఘాట్‌ 1,270
    9.రామపాదలరేవు 860
    10.మునికూడలి 739
    11.కోటిపల్లి 1,949
    12.అప్పనపల్లి 4,940
    13.అంతర్వేది 1,880
    14.వాడపల్లి 1,697
    15.జొన్నాడ 2,700 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement