విజయవాడ: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కృష్ణా జిల్లా విజయవాడలో బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గత వారం తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య మహాగర్జన బహిరంగ సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఏపీ కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
ఈ శుక్రవారం నుంచి కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్యతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై తగిన ప్రణాళికలను మంత్రివర్గం రూపొందించనుంది.